| కీర్తనలు | తూము నరసింహదాసు | వందనమిదె ఓ గణనాథా - నీకు |
| నాట - ఏక |
| పల్లవి: |
| వందనమిదె ఓ గణనాథా - నీకు |
| అనుపల్లవి: |
| వందనమిదె యరవిందంబులకన్న నందంబగు - మీ సుందరాంఘ్రులకు |
| చరణము(లు): |
| ఇందుధరుని సతిముందర ధిమిధిమి చిందులుద్రొక్కు మీ - చిన్నపదములకు |
| అనిశముఁ జతురాననుఁ డాదిగ స ద్వినుతిసేయు పదవనజములకును |
| అక్కెన ప్రగడ శ్రీహరిదాసుని మది చక్కగ నిల్పు మీ చరణంబులకును |