కీర్తనలు తూము నరసింహదాసు జయ జానకీరమణ - జయ విభీషణ శరణ
నాట - జుల్వ
పల్లవి:
జయ జానకీరమణ - జయ విభీషణ శరణ
జయ సరోరుహచరణ - జయ దీన తరణా
చరణము(లు):
జయ లోకశరణ్య - జయ భక్తకారుణ్య
జయ గణ్యలావణ్య - జయ జగద్గణ్యా
సకల లోకావాస - సాకేతపురవాస
అకలంక నిజదాస - అబ్జముఖహాసా
శుకముని వినుత పాత్ర - శుభదనుత చారిత్ర
మకరకుండలకర్ణ - మేఘసమవర్ణా
కమనీయ కోటీర - కౌస్తుభాలంకార
కమలాక్ష రఘువీర - కమలావిహారా
సమదరిపు జయధీర - సకలగుణ గంభీర
అమల హ్రీంసంచార - అఖిలార్తిహారా
రూపనిందితమార - రుచిర సద్గుణశూర
భూప దశరథకుమార - భూభారహారా
పాపసంఘ విదార - పంక్తిముఖ సంహార
శ్రీపతే సుకుమార - సీతావిహారా
AndhraBharati AMdhra bhArati - tUmu narasiMhadAsu kIrtanalu - jaya jaanakiiramaNa - jaya vibhiiShaNa sharaNa - Tumu Narasimhadasu - Tumu Narasimha Dasu ( telugu andhra )