కీర్తనలు తూము నరసింహదాసు ఎందుకే యీవట్టి బాధలు - నీకెందుకే ఎందుకే బాధలఁ
యదుకులకాంభోజి - ఆది
పల్లవి:
ఎందుకే యీవట్టి బాధలు - నీకెందుకే ఎందుకే బాధలఁ
జెందుచు నుండెద వందముగా ముచి - కుందవరద యన
చరణము(లు):
సందడిఁబడి భయ మందుచు నుండెద
వందముగా రఘునందను పదయుగ - మందునఁగల
మకరందముఁ గ్రోలక పందివలెను మదమంది తిరిగెద
ఇంద్రియములచేఁ - సందడి బడుచును - నిందు సుఖము లే
దని మును వినుచును ముందు జరుగువారలఁ దా గనుచును
పొందుగ హరి గోవింద యనవు నీ
కామాదులచేఁ గట్టువడుచు భువిఁ బామరజనముల
వేమరు వేడుచు - నేమము చెడి యముని - పురికి
నేగుచు రామ రామ శ్రీరామాయనవిక
చేరువయై మృత్యువు గనుపట్టగ దారా - పుత్రులు తమగతి
కేడ్వఁగ - మీరి శ్వాస కుత్తుక కెగఁదట్టగ -
నారాయణ నారాయణ యనవిక
వేరెవ్వరు దిక్కిఁక నీకును గల - వార మనుచు గర్వింపగ బోకనుఁ
జేరి తూము నరసింహునిఁ గూడియు -
దారిఁ దెలిసి శ్రీహరి హరి యనవిక
AndhraBharati AMdhra bhArati - tUmu narasiMhadAsu kIrtanalu - eMdukee yiivaTTi baadhalu - niikeMdukee eMdukee baadhala.r - Tumu Narasimhadasu - Tumu Narasimha Dasu ( telugu andhra )