కీర్తనలు తూము నరసింహదాసు పాహి పాహి మాం రామ - పాహి పాహి మాం

    
గానం: శ్రీ ఆకొండి శ్రీనివాస రాజారావు, కాకినాడ.

నాదనామక్రియ - ఆది
పల్లవి:
పాహి పాహి మాం రామ - పాహి పాహి మాం
చరణము(లు):
పాహి పాహి మాం లోకపాలనా ముకుంద శౌరి
మోహలోభహరణ ముని - సమూహవరద శ్రీరామ
జనకజా మనోవికాస - ఘనకదంబ తనువిలాస
మునిజనాంతరంగవాస - వనధిశయన మందహాస
దుష్టరాక్షసవిరామ - శిష్టజనమనోభిరామ
ఘృష్టిరూప సుజనమనో - భీష్టద కోదండరామ
భద్రశైలవాస రామ - భద్ర తాపసోల్లాస
అద్రిజామనోవికాస - అంజనా సుతోల్లాస
ధీరవరగుణాఢ్య తూము - నరసింహదాసవరద
వేఱు శరణ మెఱుగ దివ్య - వినుత విగ్రహాభిరామ
AndhraBharati AMdhra bhArati - tUmu narasiMhadAsu kIrtanalu - paahi paahi maaM raama - paahi paahi maaM - Tumu Narasimhadasu - Tumu Narasimha Dasu ( telugu andhra )