| కీర్తనలు | తూము నరసింహదాసు | ఏమరకుమి మనసా - రఘురాముని - |
గానం: శ్రీ ఆకొండి శ్రీనివాస రాజారావు, కాకినాడ.
| శంకరాభరణము - ఆది |
| పల్లవి: |
| ఏమరకుమి మనసా - రఘురాముని - నేమరకుమి మనసా |
| అనుపల్లవి: |
| ఏమరకుమి రఘురాముని మృదుపద తామరసంబులుఁ దలపున నుంచుము |
| చరణము(లు): |
| మొత్తముగా కఫ మెత్తి కుత్తుకకు - హత్తినవేళను - హరిస్మరణము మఱి |
| పంచప్రాణములు పట్టి తీయుటకు - మించి మృత్యువు - గనుపించు సమయమున |
| నమ్మికలేదిది - నాలుగు - దినముల - బొమ్మలాట యనినమ్మి శ్రీరాముల |
| డాసినదూతల - వేసము - గని ధృతి బాసి బెగడుతఱి భద్రగిరీశుని |
| దార పుత్రు లనుతలపు మఱచి తూము - నరసింహుఁడెద నమ్మిన రాముని |