కీర్తనలు తూము నరసింహదాసు దాశరథితోడ సరిదైవ మేదే - మన -
సురటి - ఆది / జంగల - ఆట
పల్లవి:
దాశరథితోడ సరిదైవ మేదే - మన -
దాశరథితోడ సరిదైవ మేదే
దాసులనుఁ బ్రోవఁ దలి దండ్రి క్రియనొపు, మన
చరణము(లు):
గాసి బడి వేడినను డాసి కడతేర్చుటకు
వాసి గలిగున్న రవివంశ భవుడైన, మన
మీరి కాకాసురుఁడు చేరి యపరాధినని
కోరి శరణన్నం గడతేర్చిన దాత, మన
వారినిధిగర్వ మొకసారి బాణంబునను
జూర బుచ్చిన దయావారిధియగు, మన
వింతగను వార్ధి నొక గంతున దాటిన హను
మంతు నేలిన బలవంతుడైనట్టి, మన
రావణునితమ్ముం డొగి కావుమని వేడినను
పావనుని జేసి సంభావ్యుడైనట్టి, మన
కూరిమితో భద్రగిరిఁ జేరి నరసింహులను
వారకను బ్రోచు రఘువీరు డైనట్టి, మన
AndhraBharati AMdhra bhArati - tUmu narasiMhadAsu kIrtanalu - daasharathitooDa saridaiva meedee - mana - - Tumu Narasimhadasu - Tumu Narasimha Dasu ( telugu andhra )