| కీర్తనలు | తూము నరసింహదాసు | చూడ వేడుకాయెనే సుందరాకారుని ముద్దుమోము |
| ఆనందభైరవి - చాపు |
| పల్లవి: |
| చూడ వేడుకాయెనే సుందరాకారుని ముద్దుమోము |
| చరణము(లు): |
| చూడ వేడుకాయె భక్తి - తోడ సీతాకాంతు సన్నిధి గూడి వేడుకపాటలు - బాడి యాడి కన్నులనిండ |
| చందురు గేరుమోమున - మందహాసముతోడ దాసుల నందరిం బ్రోవదలచు గో - విందు సుందరమిందుఁ గన్నుల |
| తేటకస్తూరి తిలకము ల - లాటమందు మెఱయుభక్త కోటి బ్రోచు శ్రీభద్ర - కుధరనిలయుని గన్నులనిండ |
| వాసి మిగుల భద్రశైల - వాసుఁ డెప్పుడు నారసింహ దాస హృదయ కమలమున ని - వాసుఁడైన సొంపు గన్నుల |