| కీర్తనలు | తూము నరసింహదాసు | అదిగో భద్రాద్రి - గౌతమి |
| వరాళి - ఆది |
| పల్లవి: |
| అదిగో భద్రాద్రి - గౌతమి యిదిగో చూడండి |
| చరణము(లు): |
| ముదముతో సీతా ముదితలక్ష్మణులు - కదిసి కొలువగా రఘుపతి యుండెడి |
| అనుపమానమై యతి సుందరమై - దనరు చక్రమున ధగధగమెఱసెడి |
| చారు స్వర్ణప్రాకార గోపుర - ద్వారములను సుందరమై యుండెడి |
| పొన్నల పొగడల పూపొదరిండ్లను - చెన్ను మీరగను శృంగారంబగు |
| కలియుగమందున గల వైకుంఠము - నలరుచు నున్నది నయముగ మ్రొక్కుడి |
| శ్రీకరముగ నరసింహదాసునకు - ప్రాపై యుండెడి ప్రభువు నివాసము |