| కీర్తనలు | తూము నరసింహదాసు | నమోనమో దాశరథే నమోనమో |
| శంకరాభరణము - ఆది |
| పల్లవి: |
| నమోనమో దాశరథే నమోనమో |
| అనుపల్లవి: |
| నమోనమో సుజనావనదీక్షా - సుమసుత యమహిత - విమలకటాక్షా |
| చరణము(లు): |
| కుశిక సుతాధ్వర కుశలధురీణా - వసుమతి సుమహిత వనరుహనయనా |
| అనుజ సతీయుత - అజభవసేవిత - దనుజకులాంతక - దశముఖహరణా |
| వరభద్రాచలవాస విలాస - ధరణి నారసింహ - దాస విలాస |