కీర్తనలు తూము నరసింహదాసు ధన్యుడనైతి మీ - దర్శనమున రామ - దాసుఁడనఁగ నేటికి
అసావేరి - ఆది
పల్లవి:
ధన్యుడనైతి మీ - దర్శనమున రామ - దాసుఁడనఁగ నేటికి
అన్యుల వేడ నే నాసఁజేయక యా - పన్నరక్షణ నిన్నె - సన్నుతి సేయుచు
చరణము(లు):
ముందు మీ శ్రీపాద - మందున్నయందియ - లందముతో మ్రోయఁగ -
సుందరమగు ముచికుందవరద రఘు -
నందన పదయుగ - మందు మనసుఁ జేర్చి
నిడుదలైన మీ తొడలపై కడువేడ్క - పుడమితనయ యుండఁగ
అడుగునకు మీ - రిడు పదపద్మము -
లెడసేయక మదిఁ - దడయక సేవించి
సరసముగను శ్రీ - వరభద్రాచలమె మీ - కిరవుగనుండి నేడు
వరదుఁడవై తూము - నరసింహదాసుని -
నరసి ప్రోచెడు రఘు - వరుని కరుణచే
AndhraBharati AMdhra bhArati - tUmu narasiMhadAsu kIrtanalu - dhanyuDanaiti mii - darshanamuna raama - daasu.rDana.rga neeTiki - Tumu Narasimhadasu - Tumu Narasimha Dasu ( telugu andhra )