కీర్తనలు తూము నరసింహదాసు సెలవా మాకిక - సెలవా రామయ్య
యదుకుల కాంభోజి - చాపు
పల్లవి:
సెలవా మాకిక - సెలవా రామయ్య
అనుపల్లవి:
సెలవా మాకిక శరణాగత వర - భరణా భవతరణా రామయ్య
చరణము(లు):
కలలోనైనను గలిమి గోర నిను - గన్గొన గోరెదను రామయ్య
చరణాబ్జంబుల జూడక నిముషము - సైపలేనుగదవె రామయ్య
కరుణమాలి నను బ్రహ్మ యీగతిని - గావించెను గదవె రామయ్య
ఏమి సేతు నేనెట్లు సైతునిక - నేమిగతియో గదవె రామయ్య
నానోముఫలము లిటుబాముల బెట్టగ - స్వామి యేమనందు రామయ్య
నిన్నువిడిచి చనుటకు నామది - రాకున్నది యేమిసేతు రామయ్య
ఎన్నివిధములను నిన్నెకానిమఱి - యన్యమెఱుగ గదవె రామయ్య
మరలవత్తు నామనవిదె గైకొని - మది దయ యుంచదగె రామయ్య
వరభద్రాచలపుర రఘువర నిను - వదల జాలమేల రామయ్య
శరణు శరణు మాశరణిదె రఘువర - కరుణాద్యాభరణా! రామయ్య
గరిమతోడ నరసింహదాసునకు - గతి నీవెకావె! రామయ్య
AndhraBharati AMdhra bhArati - tUmu narasiMhadAsu kIrtanalu - selavaa maakika - selavaa raamayya - Tumu Narasimhadasu - Tumu Narasimha Dasu ( telugu andhra )