కీర్తనలు తూము నరసింహదాసు పోయివత్తు నటవే - ఓ జననీ - పోయివత్తు నటవే
సురటి - ఆది
పల్లవి:
పోయివత్తు నటవే - ఓ జననీ - పోయివత్తు నటవే
పోయివత్తు నటవే - పొందుగ నీదయ - బాయకయుంచవె బంగారుతల్లి
చరణము(లు):
కన్నతల్లివి కానుపుపై భ్రమ - యున్నకతన మదిఁ జిన్నబోకుమిక
రామునితో నను బ్రేమనేలుమని - వేమారు దెల్పెడు విధము నీదెకద
తల్లడిల్లె నా యుల్లము నీకృప - జల్లవె నాపై జల్లనితల్లి
వర భద్రాచలమున శ్రీరఘువరునకు - సతివై మెఱసినచక్కని తల్లి
స్థిర మతితో నరసింహదాసునకు - సిరు లొనగూర్చెడు కరుణాకరి నే
AndhraBharati AMdhra bhArati - tUmu narasiMhadAsu kIrtanalu - pooyivattu naTavee - oo jananii - pooyivattu naTavee - Tumu Narasimhadasu - Tumu Narasimha Dasu ( telugu andhra )