కీర్తనలు తూము నరసింహదాసు వందన మిదె శ్రీరంగ నీకు వందన మిదె

    
గానం: శ్రీ ఆకొండి శ్రీనివాస రాజారావు, కాకినాడ.

తోడి (శహన) - ఆది
పల్లవి:
వందన మిదె శ్రీరంగ నీకు వందన మిదె
చరణము(లు):
వందనమిది గోవింద పరాత్పర
బృందారకముని బృందశరణ్యా
కుందరదన శరదిందు వదనమును
డిందు సేయనగు సుందరవదనా
అంగజ జనక విహంగ తురంగ భు
జంగశయన భవభంగ శుభాంగా
ధారాధరనిభ ధీరవిచారా
పారావార సమాన గంభీరా
తీరయుభయు కా - వేరి మధ్యసు వి
హార త్రిజగదాధార మహాత్మా
మురవిదళన తూము నరసింహావన
పరమదయాకర - పాతక హరణా
AndhraBharati AMdhra bhArati - tUmu narasiMhadAsu kIrtanalu - vaMdana mide shriiraMga niiku vaMdana mide - Tumu Narasimhadasu - Tumu Narasimha Dasu ( telugu andhra )