| కీర్తనలు | తూము నరసింహదాసు | కరుణ యేదిరా రంగయ్యా నీ |
| యదుకులకాంభోజి - ఆది |
| పల్లవి: |
| కరుణ యేదిరా రంగయ్యా నీ |
| చరణము(లు): |
| కరుణ యేదిర కమలామనోహర శరణని జేరిన జేకొనవిక నీ |
| వేషధారి నటంచు దోష మెన్నెదవు నా పోషకుడవు నీవె - శేషశయన నీ |
| తీరైన యుభయకావేరి మధ్యమున వి హారము సల్పు వ - య్యారిరంగ నీ |
| గరిమతోడుత తూము - నరసింహదాస హృ త్సరసిజ నిలయ శ్రీ - వరచిత్తచోర నీ |