| కీర్తనలు | తూము నరసింహదాసు | పాహిమాం కృపానిధే - పరమపురుష శ్రీహరే |
| దేశీయ - ఏక |
| పల్లవి: |
| పాహిమాం కృపానిధే - పరమపురుష శ్రీహరే |
| చరణము(లు): |
| మోహలోభతాపశమన - మునిజనాభివందితా |
| దనుజమద విదారణా - దాస సుజనపాలనా |
| భక్తచందనా కృపాళో - భవ్య సరసిజాననా |
| వారణాదిపాలనా - వైరిమదవిదారణా |
| నారసింహదాస హృదయ - నలినదినకరప్రభ |