| కీర్తనలు | తూము నరసింహదాసు | వరదునిఁ గంటినీ - కంచి వరదునిఁ గంటినీ |
| శహన - ఆది (ఆట) |
| పల్లవి: |
| వరదునిఁ గంటినీ - కంచి వరదునిఁ గంటినీ సురుచిరంబుగ భక్తాభీష్టవరదుడై వెలసిన |
| చరణము(లు): |
| పాండుఛత్రము మెఱయ నుభయ - పార్శ్వములను భాగవతులు దండిగ వింజామరలు వీవ - దైవశిఖామణి వేంచేసెడు |
| యేపు మీరిన ఖగతురంగ మెక్కి వయ్యారిచూపు లలరగ గోపురద్వారమునందు నమిత కోటి సూర్యకాంతితో వెలసిన |
| మకరకుండల యుగళము - మహిత రత్నకిరీటము ప్రకటిత కౌస్తుభహారము - ప్రేమ గులుక బిరబిర వేంచేయు |
| కనకచేలము మెఱయగ - కస్తూరి తిలకము జారగ మనసు రంజిలజేయు కుసుమ - మాలికలెల్ల శోభిల్ల వేంచేసెడు |
| వాసిగ నరసింహదాస హృదయ - నివాసుడై భద్రాచలంబున భూసుతా సహితుడైన రామునిపోడిమి దాల్చి పొందుగ వేంచేయు |