| కీర్తనలు | తూము నరసింహదాసు | సదయుడవని నిన్ను బదపడి వేడ నీ హృదయము కరుగదేమి |
| కల్యాణి - త్రిపుట (ఆట) |
| పల్లవి: |
| సదయుడవని నిన్ను బదపడి వేడ నీ హృదయము కరుగదేమి ముదముతోడ గరీంద్రు నాపద నెదను గని ప్రోచుటకు మది యిం పొదవ వేగమె కదలి మకరిని మద మణంచి కరీంద్రు బ్రోచిన |
| చరణము(లు): |
| శరణాగతత్రాణ బిరుదాంకుడవని శరణు శరణ టంచును మొరలిడిన యాద్రౌపదికి మును గరుణతో నక్షయపటంబులు స్థిరముగను దయచేసి కురుభూవరుని బారి దొలంగ జేసిన |
| కడువేడ్కతోడ మున్ బడుగు బ్రాహ్మణు డొక్కపిడికె డటుకు లివ్వగ దడయకను భక్షించి సంపద లిడిన నీదగు చర్య లిక నే నుడువనేర ననంతశయనాఢ్యుఁడ వనగ వెలసిన మహోదయ |
| కరిహరినరుల నీ వరసి ప్రోచిన వార్త గుఱిగా నే విన్నంతనే వెఱపు బాపెడు బిరుదుగల నాదొరవు నీవని మదిని నెంతో స్థిరముగా నెఱనమ్మితిని నరసింహదాసావన పరాత్పర |