| కీర్తనలు | తూము నరసింహదాసు | పయనమై యున్నాను శ్రీరాముల పాదసన్నిధికి |
| సురట - ఆట |
| పల్లవి: |
| పయనమై యున్నాను శ్రీరాముల పాదసన్నిధికి పయనమై యున్నాను పరమ భాగవతుల పాదాబ్జములు మనఃపద్మమందుఁ గొల్చి |
| చరణము(లు): |
| కామక్రోధాదులు ఖండించి మనమున రామనామామృతరసము గ్రోలుచు నేడు |
| ధరలోని శ్రీభద్రగిరి రాఘవులయందు గురినిల్పి కుదురుగ కృపవశమున |
| వాసిగాను తూము నారసింహదాసుఁ డనగ భవపాశము లిటు జిమ్మి వేవేగ |