| కీర్తనలు | తూము నరసింహదాసు | రామనామపంజరమే యిల్లాయెను - రమణులార చూడరె |
| మారువ - ఆట |
| పల్లవి: |
| రామనామపంజరమే యిల్లాయెను - రమణులార చూడరె ప్రేమమీర రామదాసులందరు మాకు - బ్రియమైన బంధువర్గంబైరి నేటికి |
| చరణము(లు): |
| బహుజన్మములకు నే పరమభక్తుల పాదపంకజముల గొల్చుచు బహుగతులను వాని బ్రార్థించి కరుణకు పాత్రుడనైయుండు భాగ్యము నేటికి |
| గంగ కృష్ణవేణి కావేరి గౌతమిగా గల తీర్థములఁ బొంగి స్నానముజేయ బంగారమును కొంత రంగుగ దివిజుల కొసంగిన ఫల మేమొ |
| వారణాద్రి ప్రయాగ భద్రాద్రియు వాసిగ శ్రీరంగము కోరి సేవించిన కోవిదులకు తూము - నారసింహదాసునని మ్రొక్కుచుండెడు |