| కీర్తనలు | తూము నరసింహదాసు | దయానిధే! దయ యేదె రామ! |
| మధ్యమావతి - ఆది |
| పల్లవి: |
| దయానిధే! దయ యేదె రామ! |
| అనుపల్లవి: |
| కుయ్యో మొఱ్ఱో యన నయ్యా విన వదే మయ్య రామయ్య - నా కుయ్యాలింపగదయ్య |
| చరణము(లు): |
| పూర్వాకృతముచే దురాశలను బడి పరార్థ మెఱుగని దురాత్ముడనో |
| వృధాభిమానుఁడ క్షుధార్తుఁడను బె న్నిధానమని సన్నిధానమె కోరితి |
| భవాత్మ కాశ్రిత భయాపహర సాంబ శివార్చిత నారసింహ మనోత్సవ |