| కీర్తనలు | తూము నరసింహదాసు | నీకు నాకు దంటలే శ్రీరామ - నిన్ను విడిచిపోనులే |
| సురటి - చాపు |
| పల్లవి: |
| నీకు నాకు దంటలే శ్రీరామ - నిన్ను విడిచిపోనులే నీకు నాకు దంటగాక యీభువిలోన ననేకులు గల రైతే నాకేమి పని యిక |
| చరణము(లు): |
| పతితుడ నేను పావనుఁడ వీవు - నాకు గతి నీవు నే నీకు నతికూర్మి దాసుఁడ |
| శరణాగతత్రాణ శపథపరుడ వీవు శరణని వేడెడు చతురుఁడను నేను |
| కారుణ్యనిధి వీవు కఠినచిత్తుఁడ నేను భారకుడవు నీవు పాత్రుఁడ నేను |
| దాతవు నీవు దాసుఁడ నేను - బ్ర ఖ్యాతిపరుడ వీవు భీతాత్ముఁడ నేను |
| కూరిమితో భక్తోద్ధారకుడవు నీవు నారసింహుడను నామధేయుడ నేను |