కీర్తనలు తూము నరసింహదాసు ఎంతో రమ్యమై యున్నది - రాములభవన
కాంభోజి - ఆది
పల్లవి:
ఎంతో రమ్యమై యున్నది - రాములభవన
మెంతో రమ్యమై యున్నది
కంతుకోటిజితకాంతి గలిగి భువి
సంతతమును రామచంద్రులుండు గృహ
చరణము(లు):
పావన మైనట్టి భక్త కదంబము
సేవసేయఁగ మన సీతావరునిగృహ
ఇంపుగ వీణ వాయించుచుఁ గీర్తన
లింపుగ జేసి కీర్తింప రాముని భవన
క్రొత్తగ వ్రాసిన చిత్తరు ప్రతిమలు
మొత్తమై మెఱయ రఘూత్తముని సదన
వాసి గలుగు భక్తవరులు గూడి నుతిఁ
జేసి వేడువేళ శ్రీరాముల సదన
కోరి వేడు తూము నారసింహునిఁ బ్రోచు
ధీరుని భద్రాద్రి విహారుని సదనము
AndhraBharati AMdhra bhArati - tUmu narasiMhadAsu kIrtanalu - eMtoo ramyamai yunnadi - raamulabhavana - Tumu Narasimhadasu - Tumu Narasimha Dasu ( telugu andhra )