| కీర్తనలు | తూము నరసింహదాసు | జాగేల పొందెదరు సఖియలారా మీరు |
| మోహన - రూపక |
| పల్లవి: |
| జాగేల పొందెదరు సఖియలారా మీరు స్వామి వేంచేసెడు సమయ మిదె కొమ్మా |
| చరణము(లు): |
| అదిగో కాహళరవము యదిగో భేరీనినద మదిగో మురళీనాద మదిగో వినరమ్మ |
| బృందారకముని బృందస్తవము లవె అందంద విననయ్యె నదిగో గనరమ్మ |
| అశ్వధాటి ధూళి యదిగో మిన్నందెను విశ్వ మేలెడు విభుఁడు వేంచేయునమ్మా |
| అదిగో ముక్తాఛత్ర మవిగో వింజామరలు అదిగో తురగరాజ మదె చూడరమ్మా |
| మీరి శ్రీభద్రాద్రి వీరరాఘవశౌరి నారసింహుని బ్రోవ నదె వచ్చెనమ్మా |