కీర్తనలు తూము నరసింహదాసు నోరూరు గదవె శ్రీరాముని దలచిన నోరూరు గదవె
బిలహరి - రూపక
పల్లవి:
నోరూరు గదవె శ్రీరాముని దలచిన నోరూరు గదవె
పాలు మీగడ మేలిచెక్కర - చాలమెక్కిన పోలికను
చరణము(లు):
మేరు సమధీరు జగదా - ధారు శ్రీరఘువీరు దలచిన
కూరిమితో నరసింహదాసుని - జేరు రామునిపేరు దలచిన
AndhraBharati AMdhra bhArati - tUmu narasiMhadAsu kIrtanalu - nooruuru gadave shriiraamuni dalachina nooruuru gadave - Tumu Narasimhadasu - Tumu Narasimha Dasu ( telugu andhra )