కీర్తనలు తూము నరసింహదాసు కపురంపు విడెము లివిగోను, రామ, కరుణ జేకొనుము మ్రొక్కేను
కాఫి - ఆట
పల్లవి:
కపురంపు విడెము లివిగోను, రామ, కరుణ జేకొనుము మ్రొక్కేను
నిపుణయై సీతానెలత అందిచ్చేటి
చరణము(లు):
పచ్చిపోక లిచ్చవచ్చు లవంగాలు
మెచ్చయిన యాలకులు మిళితమై యొప్పెడు
కాచు నారికేళ ఖండములును యెంతో
రాచయోగ్యమైన దాచిన యుతముగ
పండు జాజిఫలములు పలుచని జాపత్రి
దండిగ నరసింహదాసు డర్పించేది
AndhraBharati AMdhra bhArati - tUmu narasiMhadAsu kIrtanalu - kapuraMpu viDemu livigoonu, raama, karuNa jeekonumu mrokkeenu - Tumu Narasimhadasu - Tumu Narasimha Dasu ( telugu andhra )