| కీర్తనలు | తూము నరసింహదాసు | కర్పూర హారతు లివ్వరే, శ్రీరాములకు |
| మధ్యమావతి - ఆది |
| పల్లవి: |
| కర్పూర హారతు లివ్వరే, శ్రీరాములకు కర్పూర హారతు లివ్వరె నేర్పుమీరఁగ మీర లోర్పుతోడుత గందర్పునిఁ గన్నతండ్రికి |
| చరణము(లు): |
| పున్నమ చంద్రుని గేరుచున్న నగుమోమువాని గన్నుల గాంచి మిగుల సన్నుతు లెసగజేసి |
| పూని భుజంగరాజుకైనఁ బొగడంగ రాని వాని నేమరక యిపుడు ధ్యానించి శ్రీపాదములకు |
| పంకజముఖులు కరపంకజములు సాచి పంకజనాభునిమ్రోల సంకీర్తనములుచేసి |
| కోరి సేవించువారికిఁ గోరిక లిచ్చి ప్రోచు ధీరుఁడైనట్టి రఘువీరున కిపుడు మీరు |
| మీరి భద్రాచల విహారుడై నేడు తూము నారసింహుని దరిజేరి ప్రోచెడిస్వామికి |