| కీర్తనలు | తూము నరసింహదాసు | అవధరింపుమీ రామ - అవధరింపుమీ |
| ఆరభి - జులువ |
| పల్లవి: |
| అవధరింపుమీ రామ - అవధరింపుమీ అవలీలల చామరములు సేవక జను లేయుచున్నా |
| చరణము(లు): |
| రజత దండధారు లిదె పరాకు దెల్పుచున్నవార |
| వీణ గానరవము సేయుచు విబుధు లెదుట నిలిచియున్నా |
| నిన్ను గొలుచు వేడ్క జనము లున్నవార లెదుట నిలిచి |
| భద్రనగ సుధామ రామభద్ర నీరదశ్యామ |
| ఆశతోడ నారసింహదాసు డెపుడు గొలుచుచున్నా |