కీర్తనలు తూము నరసింహదాసు శ్రీమానస నవకైరవసోమా రిపుభీమా
కేదారగౌళ - రూపక
పల్లవి:
శ్రీమానస నవకైరవసోమా రిపుభీమా
రామా శ్రీ భద్రాచలధామా
చరణము(లు):
నారాయణ మధుసూదన నీరేజనాభ
సారసభవ నారదనుత శ్రీపద్మనాభా
ధరణీవర కరుణాకర వరమునిజనపోష
సురవందితచరణా భవతరణా
కనకాంబర వరమణిమయకాంచన సద్భూషా
దినకరవంశాంబుధి యోషధీశా
కుండలమణి మండిత గండస్థలశోభా
చండదనుజభండన వేదండా
ధీర మహోదార యిలోద్ధార యశస్సార
భూరిదయాపూరా రఘువీరా
రామ ఘనశ్యామ బుధస్తోమ జనకామా
సామజవరదా సురనుతనామా
భూమిసుతా సహితా సన్నామా కవిరామా
శ్రీమదయోధ్యా మంజులరామా
అంభోరుహ కుంభోద్భవ సంభావితచరణా
జంభాంతక మణిసదృశశ్యామా
భీషణ ఖరదూషణ మదశోషణ నిజవేషా
పూషాన్వయ భూషణమణిభూషా
కుటిలాలక శోభిత ఘట నిటలాకుటితటలా
చటులాసుర పటలాంతక జయ జయ
మునిమానస వనరుహ శోభన దినకరరూపా
వనజాయతలోచన రఘువల్లభ
శ్రీయుత నుతవాయుసు తామేయబలోపాయ
సాయక రఘునాయక ఫలదాయక
మనువంశాంబుధిసోమ వరమునిజనపరిపాలా
దనుజాంతక నరసింహావనచరణ
AndhraBharati AMdhra bhArati - tUmu narasiMhadAsu kIrtanalu - shriimaanasa navakairavasoomaa ripubhiimaa - Tumu Narasimhadasu - Tumu Narasimha Dasu ( telugu andhra )