| కీర్తనలు | తూము నరసింహదాసు | ఉయ్యాలో జంపాలోఁ మాయొప్పులకుప్పనికి |
| కల్యాణి - ఆట |
| పల్లవి: |
| ఉయ్యాలో జంపాలోఁ మాయొప్పులకుప్పనికి కరి కుయ్యాలించిన గోపాలునకు |
| చరణము(లు): |
| ఒడ్డారించిన దొడ్డ దనుజుల జడ్డ లుడిపి మా కడ్డ బొడ్డున నొక్కవుడ్డె తల లున్నబిడ్డను గన్నబిడ్డనికి |
| ఆలమున దనుజుల దునిమి దైవాలవిన్నప మాలకించి నైలింప కోల లమరిన బాలుని గన్న బాలునికి వుయ్యాలో |
| ఆపన్నులకెల్ల ప్రాపై శోభనాద్రిపై నరసింహరూపమయి పాపములెల్ల బాపదగు నీదు పాపని గన్న పాపనికి |