| కీర్తనలు | తూము నరసింహదాసు | విరిబంతులాటలు చూడరే మనవెలది సీతాపతిని వేడరే |
| కాఫి - ఆట |
| పల్లవి: |
| విరిబంతులాటలు చూడరే మనవెలది సీతాపతిని వేడరే సరసంపు మోమున చిరునగ వొప్పగ కరకంకణంబులు ఘల్లని మ్రోయహ |
| చరణము(లు): |
| కలికిచూపుల నీటు గుల్కగ నెంతో కనుసైగలను నీటు చిల్కగ అలికుంతలములు మోమందు గునిసియాడ చిలుకలకొలికి యా సీతారాము లాడెడి |
| ఉరమందు ముత్యాలసరములు యెంతో చిలుకల పలుకులు మెఱయగవింత బంతులు కేలబూని శ్రీకరమైన నవ్వుల కాంతారాము లాడెడు |
| శృంగారరసములు గుల్కగ నెంతో అంగన లిరుదెస బాడగ రవముద్దుటుంగరములు వ్రేళ్ళ మెఱయ సీతారాము లాడెడి |
| కందర్పజనకుఁడు సీత యాడు కందుక క్రీడానిపుణత పొందుగ భద్రాద్రియందునగాక మరెందు గలదు ఓ యిందువదనలారా |
| తాటంకములొరసియాడగ మంచి తళుకు కస్తురిబొట్టు మీరగ కాటుక కన్నులకాంతి మెఱయగ సీతా కాంతుని మోము తా గనుగొని యాడెడి |
| మీరి భద్రాద్రి విహారుడు తూము నారసింహుని బ్రోచుధీరుడు కోరి త్రిజగములు వారక నొకటిగ జేరిచి పువ్వుల చెండ్లాడెడి |