కీర్తనలు తూము నరసింహదాసు జయమంగళం నిత్య శుభమంగళం - మాతల్లి సీతమ్మకు

    
గానం: శ్రీ ఆకొండి శ్రీనివాస రాజారావు, కాకినాడ.

(మంగళహారతి) మధ్యమావతి - ఆది
పల్లవి:
జయమంగళం నిత్య శుభమంగళం - మాతల్లి సీతమ్మకు
అనుపల్లవి:
జయమంగళం భక్తజనులకు శుభములు -
దయసేయునట్టి మాతల్లి సీతమ్మకు
చరణము(లు):
అందెలు పాదారవిందము లందున
పొందుగమ్రోయు నాసుందరి కన్యకు
తళుకుమోమున మంచి తిలకము మెఱయగ
మొలకనవ్వుల ముద్దులొల్కు సీతమ్మకు
తాటంకరుచులెల్ల మాటిమాటికిని
ధాటి వహించు సుధాంశుసోదరికి
ప్రేమతో భద్రాద్రిరాముల నేరక
కామించి ప్రోచెడు రాములరాణికి
వాసిగ నరసింహదాసుని హృదయ ని
వాసుడౌ శ్రీశ్రీనివాసుని దేవికి
AndhraBharati AMdhra bhArati - tUmu narasiMhadAsu kIrtanalu - jayamaMgaLaM nitya shubhamaMgaLaM - maatalli siitammaku - Tumu Narasimhadasu - Tumu Narasimha Dasu ( telugu andhra )