కీర్తనలు తూము నరసింహదాసు ఎందు కలిగినావు దెల్పరా రఘునందన నీ వెందు కలిగినావు దెల్పరా
మధ్యమావతి - చాపు
పల్లవి:
ఎందు కలిగినావు దెల్పరా రఘునందన నీ వెందు కలిగినావు దెల్పరా
ఎందు కలిగినావు దశరథనందన గోవింద శౌరి
చరణము(లు):
ఇందిరామనోహరా ని - న్నిందు రమ్మని వేడుకొంటె
శరణుజొచ్చినాడ నన్ను - జేకొని రక్షించుమంటె
పన్నగాధిపశయన సుప్ర - సన్న సన్నుతలోచన
అంజనాసుతసేవిత రిపు - భంజనా కంజాతలోచన
కన్నెడ చేయక నన్ను కరుణతో గాపాడుమంటె
మ్రొక్కి మ్రొక్కి వేడిన నా - దిక్కు జూడకను నీ
అందమైన నీ పదార - విందములను జూపుమంటె
పంచశర శతకోటి సుందర - కాంచ చేలా విశాల
పంచదార బెట్టెద మో - మించుక జూపుమంటె
కుందకోరకరదన ముని - బృందమానస సదన
వాసవసన్నుత చిద్వి - లాస దాసమనోవికాస
అంగజారినుతాప్రమేయ - భృంగ చికుర శుభానుషంగ
మేరుధీర సమాన జగదాధార ప్రణవాకార నే డీ
కేశవాచ్యుతా ముకుంద - యీశ భవపాశాచ్యుత నీ
కందరాభ శరీర హృతదశ - కంధరాదరకంధరా నీ
దందశూకవిరోధి వాహన - బంధమోచన పాపహర నీ
వారినిధి గంభీరవర సుకు - మార కౌస్తుభహార నే డీ
ఖరమురాసురభీషణా కర - కంఠయువతీ భూషణా నీ
మిత్రపూజ కులాబ్ధిచంద్రసు - మిత్ర తనయాగ్రజ నీ
శంకరప్రముఖాభి వందిత - పంకజాక్ష జనార్దన నీ
ఎన్నివిధములనైన నే నీ - కన్న పరులను వేడసుమ్మి
నారదాది మునీంద్రపోషా - నారసింహ మనోవికాస
AndhraBharati AMdhra bhArati - tUmu narasiMhadAsu kIrtanalu - eMdu kaliginaavu delparaa raghunaMdana nii veMdu kaliginaavu delparaa - Tumu Narasimhadasu - Tumu Narasimha Dasu ( telugu andhra )