కీర్తనలు తూము నరసింహదాసు దారిద్రుఁడని మా - సదనమునకు రావేమో తగునా జగన్నాథా
శంకరాభరణము - చాపు
పల్లవి:
దారిద్రుఁడని మా - సదనమునకు రావేమో తగునా జగన్నాథా
భూయశుఁడవు నీవు - భూమిలోనను విషమ
బుద్ధి నీకు లేదు పుణ్యాత్ముడ వీవు
చరణము(లు):
సితదంతిపైని భా - సితకోటి సూర్యులగతి మించు తేజమున
అతులిత విభవములంది తిరువీథుల యందు
న్నతి వేంచేయు గోవింద పరాత్పర
కరదీపికలు వేయుఁ గర మర్థితో గాంతి ఘనతిమిరము బాపగా
సరసతతో దేవ సతులు నాట్యముచేయ -
పురజనులెల్ల భాసురముగ గొల్వగ
భేరి మృదంగ కాహళ రవములు మ్రోయఁ జారు వింజామరలు
మీరి వైషవు లేయ మెచ్చిన శ్రీరామ -
తారకనరసింహ దాసపోషక నేడు
AndhraBharati AMdhra bhArati - tUmu narasiMhadAsu kIrtanalu - daaridru.rDani maa - sadanamunaku raaveemoo tagunaa jagannaathaa - Tumu Narasimhadasu - Tumu Narasimha Dasu ( telugu andhra )