| కీర్తనలు | తూము నరసింహదాసు | నిను నమ్మియున్నవాడను |
| నాదనామక్రియ - ఆది |
| పల్లవి: |
| నిను నమ్మియున్నవాడను నిను నమ్మియున్నవాడ నీరేజదళనేత్ర చనువిచ్చి మాటాడవు సామి నానేర మేమి |
| చరణము(లు): |
| ఘనమయిన తాపత్రయము దినదినము యేచగానే వినయముతోడ దెల్ప వినన ట్లున్నా విదేమి |
| శరణాగతుడైన మీ మరుపు జొచ్చిన నన్ను వెరవకుమని ప్రోచు విధము జూపవదేమి |
| నగుమోము జూపి నేడు నాతో మాటాడవేమి పగవాడనా నీకు తగునా జాగేల నయయో |
| మొఱుగు తెర గదేమనవు బిరుదు పేదరికమా నా తరమా నీదయ రాకున్న దరి జేర నయయో |
| భారము నీదనుచు పరుల వేడగబోక కోరినప్రాపు దాపు జేరియున్నాడ సామి |
| గరిమతోడుత తూము నరసింహదాసునకు గురిగా ప్రాపైనాడవని ని న్నరసి సేవించినాడ |