| కీర్తనలు | తూము నరసింహదాసు | భాగవతుల పాదరజము పైని జల్లుకోవలె |
| బిలహరి - ఆది |
| పల్లవి: |
| భాగవతుల పాదరజము పైని జల్లుకోవలె భాగవతుల సేవ మనకు భాగ్య మనుకోవలె |
| చరణము(లు): |
| గంగ కృష్ణవేణిలోన గ్రహణకాలమందున పొంగి స్నానమాచరించు పుణ్యమునకు మించు నీ |
| మేటి పుణ్యదినములను మెచ్చి యిచ్చినట్టి యా కోటి కన్యాదాన ఫలము కోరి గాంచినట్టి యా |
| భవనాశ మొందుటకును భక్తితో నొనర్చు నా సవనశత మొసంగుఫలము సదృశమనగ బోలు నీ |
| భద్రగిరినివాసుని పాదపద్మయుగము మనము నా భద్రమనుచును నమ్మియున్న పరమముఖ్యులయిన యీ |
| పలువిధముల బ్రోచుటకును బ్రాపు దాపు గాను మున్ జెలగి నారసింహునకును జీవనముగనున్న యీ |