కీర్తనలు తూము నరసింహదాసు హరి నామొర విని రావదేమి శ్రీహరి నామొర విని రావదేమి
ఆనందభైరవి - ఆట
పల్లవి:
హరి నామొర విని రావదేమి శ్రీహరి నామొర విని రావదేమి
భద్రగిరి దూరంబని మరచియున్నావో
చరణము(లు):
కరిరాజు నీకు చుట్టమా వాని
మొర విని వేగ మకరిని ద్రుంపవా
దిక్కీవుగాక మాకెవరు యింత
లరయు చుండినవైరు లరసి మీరుదురు
వెఱవకుమని పల్క రాదా తూము
నరసింహదాసపోషక దయ లేదా
AndhraBharati AMdhra bhArati - tUmu narasiMhadAsu kIrtanalu - hari naamora vini raavadeemi shriihari naamora vini raavadeemi - Tumu Narasimhadasu - Tumu Narasimha Dasu ( telugu andhra )