కీర్తనలు తూము నరసింహదాసు భద్రాచలనిలయ మాం పాలయ పావనబిరుదే దయ నీదయ
బిలహరి - చాపు
పల్లవి:
భద్రాచలనిలయ మాం పాలయ పావనబిరుదే దయ నీదయ
అద్రిజానుత హాటకాంబరధర రుద్రభయహరణ కాద్రువేయశయన
చరణము(లు):
దాసోహ మనుటకు దారి దెలియదాయె
వేసము దాల్చిన వేసారుటాయె
కరుగదాయె మది కఠినత్వ మేమొ
కరుణ జూచి నన్ను కాపాడవైతవి
వరదరామదాసుడని యనుటాయె
వరము లొసగకున్న మఱి తాళడాయె
AndhraBharati AMdhra bhArati - tUmu narasiMhadAsu kIrtanalu - bhadraachalanilaya maaM paalaya paavanabirudee daya niidaya - Tumu Narasimhadasu - Tumu Narasimha Dasu ( telugu andhra )