| కీర్తనలు | తూము నరసింహదాసు | నారాయణ శ్రీమన్నారాయణ |
| యమునాకల్యాణి - ఆది |
| పల్లవి: |
| నారాయణ శ్రీమన్నారాయణ నారాయణాచ్యుత నగధర నారసింహనామా అనంత శౌరి |
| చరణము(లు): |
| పన్నగశయన సుప్రసన్న దీనుల బ్రోవకున్నా విదేమి శ్రీమన్నారాయణ |
| నిన్నే నమ్మితినని యున్నవాడను నన్ను మన్నింపవయ్య శ్రీమన్నారాయణ |
| ఎన్నడు పరుల వేడకున్న వాడను నన్ను కన్నడ సేయకయ్య నారాయణ |
| మారకజన మేరుధీర పావకసమ సుదర్శనధర శ్రీమన్నారాయణ |
| వేరే నీకన్న దిక్కు లేరని మున్నే నిన్ను జేరితి శ్రీమన్నారాయణ |
| కోరిక లిచ్చి తూము నారసింహుని జేరి కాచి రక్షించు శ్రీమన్నారాయణ |