| కీర్తనలు | త్యాగరాజు | అతడే ధన్యుడురా; ఓమనసా! |
| కాపి - చాపు |
| పల్లవి: |
| అతడే ధన్యుడురా; ఓమనసా! ॥అతడే॥ |
| అను పల్లవి: |
| సతతయాన సుత ధృతమైన సీతా పతి పాదయుగమును సతతము స్మరియించు ॥నతడే॥ |
| చరణము(లు): |
| వెనుకఁదీక తనమనసు రంజిల్లగ ఘనమైన నామ కీర్తన పరుఁడైనట్టి ॥యతడే॥ |
| తుంబురువలె తన తంబూరబట్టి ద యాంబుధి సన్ని ధానంబున నటియించు ॥నతడే॥ |
| సాయకు సుజనుల బాయక తాను ను పాయమునను ప్రొద్దు హాయిగ గడపు ॥నతడే॥ |
| ఉల్లపు తాపము చల్లజేసి యన్ని కల్లలను యెంచి సల్లాపమున నుండు ॥నతడే॥ |
| కరివరదుని తత్వ మెఱుఁగను మఱిగించి అరిషడ్వర్గములందు బరవలేకఁ దిరుగు ॥నతడే॥ |
| ఆర్తిని మఱియు బ్రవర్తినిఁ దొలగించి కీర్తిగల్గిన రామమూర్తిని నెరనమ్ము ॥నతడే॥ |
| కలగని నిజ విప్రకులమున జన్మించి నిలువరమగు ముక్తిఫలమును జేకొన్న ॥యతడే॥ |
| కర్మ నిష్టుఁడైన ధర్మశీలుఁడైన శర్మ రామనామ మర్మము దెలిసిన ॥యతడే॥ |
| కాసు వీసములకోసము ఆసతో వేసము ధరియించి మోసము జెందని ॥యతడే॥ |
| అందముగా నామ మందరు జేసిన సుందర రామునియందు లక్ష్యము బెట్టు ॥అతడే॥ |
| అన్ని పాటుకు సర్వోన్నత సుఖ మున్న యనుభవించుకొన్న వాఁడెవఁడో? ॥అతడే॥ |
| రాజస జనులతోఁ దా జతగూడక రాజిల్లు శ్రీత్యాగరాజనుతుని నమ్ము ॥అతడే॥ |