| యదుకుల కాంభోజి - ఆది |
| పల్లవి: |
| అది కాదు భజన మనసా! ॥అది॥ |
| అను పల్లవి: |
| ఎదలో నెంచు టొకటి ప - య్యెద గల్గినచో నొకటి ॥అది॥ |
| చరణము(లు): |
గొప్ప తనముకై యాస
కుచ్చిత విషయ పిపాస
మెప్పులకై బహు వేస మిడి
ఉప్ప తిల్లెదరు; త్యాగరాజ వినుత! ॥అది॥ |
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - adi kaadu bhajana, manasaa ( telugu andhra )