| కీర్తనలు | త్యాగరాజు | అన్యాయము సేయకురా, రామ నన్నన్యునిగ జూడకురా |
| కాపి - ఆది |
| పల్లవి: |
| అన్యాయము సేయకురా రామ! న న్నన్యునిగ జూడకురా; నాయెడ, రామ! ॥అన్యాయము॥ |
| అను పల్లవి: |
| ఎన్నో తప్పులు గలవారిని, రా జన్య! నీవు బ్రోచినావు గనుకను ॥అన్యాయము॥ |
| చరణము(లు): |
| జడభరతుఁడు జింక శిశువునెత్తి బడలిక దీర్చగ లేదా? కడలిని మునిగిన గిరి నొక కూర్మము గాపాడ లేదా? పుడమిని పాండవ ద్రోహిని ధర్మ పుత్రుఁడు బ్రోవగ లేదా? నడిమి ప్రాయమున త్యాగరాజనుత! నా పూర్వజు బాధ దీర్ప లేదా? ॥అన్యాయము॥ |