| కీర్తనలు | త్యాగరాజు | ఆదయ శ్రీరఘువర! నేడేల - రాదయ? ఓ దయాంబుధి! |
| ఆహిరి - ఆది |
| పల్లవి: |
| ఆదయ శ్రీరఘువర! నేడేల - రాదయ? ఓ దయాంబుధి! నీ ॥కా॥ |
| అను పల్లవి: |
| మోదముతో సద్భక్తిమర్మమును - బోధన జేసి సదా బ్రోచిన నీ ॥కా॥ |
| చరణము(లు): |
| నిన్ను తిట్టికొట్టి హింసబెట్టిన దన్నియు నన్నన లేదా? ఎన్నరాని నిందలఁ దాళుమని మన్నించగ లేదా? అన్నముఁ దాంబూల మొసగి దేహము మిన్నఁ జేయ లేదా? కన్న తల్లి దండ్రి మేమనుచు త్యాగరాజునికిఁ బరవసమీ లేదా? నీ ॥కా॥ |