| కీర్తనలు | త్యాగరాజు | ఇంతకన్నానందమేమొ ఓరామ రామ |
| బిలహరి - రూపకము |
| పల్లవి: |
| ఇంతకన్నానందమేమొ ఓరామ రామ ॥ఇం॥ |
| అను పల్లవి: |
| సంతజనులకొల్ల సమ్మతియుంటే కాని ॥ఇం॥ |
| చరణము(లు): |
| ఆడుచు నాదమునఁ బాడుచు ఎదుటరా వేడుచు మనసునఁగూడి యుండేది చాలు ॥ఇం॥ |
| శ్రీహరికీర్తనచే దేహాదియింద్రియ స మూహముల మఱచి సోహమైనదె చాలు ॥ఇం॥ |
| నీజపములవేళ నీజగములు నీపై రాజిల్లు నయ త్యాగరాజనుత చరిత్ర ॥ఇం॥ |