| కీర్తనలు | త్యాగరాజు | ఇక గావలసిన దేమి మనసా? సుఖమున నుండవదేమి? |
| బలహంస - ఆది |
| పల్లవి: |
| ఇక గావలసిన దేమి మనసా? సుఖమున నుండవదేమి? ॥ఇక॥ |
| అను పల్లవి: |
| అఖిలాండ కోటి బ్రహ్మాండనాథుఁ డంతరంగమున నెలకొని యుండగ ॥నిక॥ |
| చరణము(లు): |
| ముందటి జన్మములను జేసిన యఘ బృంద విపినముల కా నంద కందుఁడైన సీతాపతి నందకాయుధుడై యుండగ ॥నిక॥ |
| కామాది లోభ మోహ మద స్తోమ తమమ్ములకును సోమ సూర్య నేత్రుడైన శ్రీ రామచంద్రుఁడే నీ యందుండగ ॥నిక॥ |
| క్షేమాది శుభములను త్యాగరాజ కామితార్థములను నేమమున నిచ్చే దయానిధి రామభద్రుఁడే నీయం దుండగ ॥నిక॥ |