| కీర్తనలు | త్యాగరాజు | ఉపచారము జేసేవారున్నారని మరవకురా |
| భైరవి - రూపక |
| పల్లవి: |
| ఉపచారము జేసేవారున్నారని మరవకురా ఉ.. |
| అను పల్లవి: |
| కృప కావలెనని నే నీ కీర్తిని పల్కుచు నుండఁగ ఉ.. |
| చరణము(లు): |
| వాకిటనే పదిలముగా వాతాత్మజుఁడున్నాడని శ్రీకరులగు నీ తమ్ములు చేరియున్నారని ఏకాంతమునను జానకి ఏర్పడియున్నదని శ్రీకాంత పరులేలని శ్రీ త్యాగరాజ వినుత ఉ.. |