| కీర్తనలు | త్యాగరాజు | ఉపచారములను చేకొనవయ్య ఉరగరాజ శయన! |
| భైరవి - ఆది |
| పల్లవి: |
| ఉపచారములను చేకొనవయ్య ఉరగరాజ శయన! ॥ఉప॥ |
| అను పల్లవి: |
| చపల కోటి నిభాంబరధర! శ్రీ జానకీపతి! దయజేసి నా ॥దుప॥ |
| చరణము(లు): |
| కపట నాటక సూత్ర ధారివై కామిత ఫలము లొసఁగెడు రామ అపరిమిత నవరత్నము ల్బొదిగిన యపరంజి గొడుగు నీకే తగునయ్య ॥ఉప॥ |
| మెరుగు తీగలరీతిని మెరసెడు కఱకు బంగారు కాఁడ లమరిన శరదిందు ద్యుతి సమానమౌ చా మర యుగములు నీకే తగునయ్య ॥ఉప॥ |
| జాజులు సంపంగులు మరువవు విర జాజులు కురువేరు వాసనలను వి రాజ మానమగు వ్యజనము త్యాగ రాజ వినుత! నీకే తగునయ్య ॥ఉప॥ |