| సరస్వతీ మనోహరి - దేశాది |
| పల్లవి: |
ఎంతవేడుకొందు రాఘవ
పంతమేలరా ఓ రాఘవ ॥ఎం॥ |
| అను పల్లవి: |
చింతఁ దీర్చుట కెంతమోడిరా
అంతరాత్మ నాచెంతరాను నే ॥నెం॥ |
| చరణము(లు): |
చిత్తమందు నిన్నుఁ జూచు సౌఖ్యమే
ఉత్తమంబనుచు ఉప్పొంగుచును
సత్తమాత్రమా చాల నమ్మితిని
సార్వభౌమ శ్రీత్యాగరాజ నుత ॥ఎం॥ |
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - eMtaveeDukoMdu raaghava ( telugu andhra )