| కీర్తనలు | త్యాగరాజు | ఎటులబ్రోతువో తెలియ నేకాంతరామయ్య |
| చక్రవాకం - త్రిపుట |
| పల్లవి: |
| ఎటులబ్రోతువో తెలియ నేకాంతరామయ్య ॥ఎ॥ |
| అను పల్లవి: |
| కటకట నా చరితము కర్ణకఠోరమయ్య ॥ఎ॥ |
| చరణము(లు): |
| వట్టి గొడ్డురీతి భక్షించి తిరిగితి పుట్టులోభులను పొట్టకై పొగడితి దుష్టులతోఁ గూడి దుష్కృత్యములు సల్పి ఱట్టుబడిన త్యాగరాజుని దయతో ॥ఎ॥ |