| కీర్తనలు | త్యాగరాజు | ఎటులైన భక్తి వచ్చుటకే యత్నము సేయవే |
| సామ - చాపు |
| పల్లవి: |
| ఎటులైన భక్తి వచ్చుటకే యత్నము సేయవే ॥ఎటులైన॥ |
| అను పల్లవి: |
| మటుమాయ భవమును మనదని యెంచక వటపత్ర శయనుని పాదయుగములందు |
| చరణము(లు): |
| విద్యా గర్వము లేల? నీ వ విద్యా వశము గానేల? ఖద్యోతాన్వయ తిలకుని పురమేలు బుద్ధి యాశుగ దోచనేల? ఓ మనసా! ॥ఎటులైన॥ |
| రామ నామము సేయ సిగ్గా? కారా దేమి బల్కవు పుంటి బుగ్గ భామలు గరదాటక యుండిన జగ్గ పామర మేను నమ్మక నీటి బుగ్గ ॥ఎటులైన॥ |
| భోగ భాగ్యములందు నిజ భాగవతులకౌ నీ పొందు త్యాగరాజ వరదుని నీ యందు బాగుగ ధ్యానించు భవ రోగమందు ॥ఎటులైన॥ |