| కీర్తనలు | త్యాగరాజు | ఎవరి మాట విన్నావో రావొ యిందులేవో భళిభళి |
| కాంభోజి - ఆది |
| పల్లవి: |
| ఎవరి మాట విన్నావో రావొ యిందులేవో భళిభళి ॥ఎ॥ |
| అను పల్లవి: |
| అవనిలో నార్షేయ పౌరుషేయమంది చోద్యమెఱుఁగ లేనయ్య ॥ఎ॥ |
| చరణము(లు): |
| భక్తపరాధీనుఁడనుచుఁ బరమభాగవతుల వ్యక్తరూపుఁడై పలికిన ముచ్చట యుక్తమనుచు నుంటి శక్తిగల మహాదేవుఁడు నీవని సంతోషమున నుంటి సత్త చిత్తుడగు త్యాగరాజనుత సత్యసంధుఁ డనుకొంటి నిలలో ॥ఎ॥ |